లాడ్జీలో వ్యభిచారం.. ఆరు జంటలు అరెస్ట్

మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లా కేంద్రం జన్మభూమినగర్​లోని వెంకటేశ్వర లాడ్జీలో వ్యభిచారం నడుస్తుందన్న సమాచారంలో పోలీసులు మంగళవారం దాడి చేశారు. ఈ సందర్భంగా ఆరుగురు విటులు, ఆరుగురు మహిళలను అదుపులోకి తీసుకు న్నట్టు సీఐ బన్సీలాల్ తెలిపారు. 

ఇటీవల బెల్లంపల్లి చౌరస్తాలోని సాయినాథ్ రెసిడెన్సీలో ఇలాగే ఆరు జంటలను పట్టుకున్నారు. పోలీసులు ఓవైపు లాడ్జీలపై రైడ్ చేస్తుంటే.. మరోవైపు విచ్చలవిడిగా వ్యభిచారం నడుస్తూనే ఉంది. మంచిర్యాలలోని చాలా లాడ్జీలు వ్యభిచారానికి అడ్డాగా మారాయని ఆరోపణలు వస్తున్నాయి.