ఆసిఫాబాద్/జైపూర్/చెన్నూర్/బోథ్, వెలుగు: విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని పోలీస్అధికారులు కొనియాడారు.పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను పురస్కరించుకొని పలు చోట్ల రక్తదాన శిబిరాలు నిర్వహించారు. జైపూర్ మండల కేంద్రంలోని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ డిస్పెన్సరీలో రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ లో 250 మంది పాల్గొని రక్తదానం చేశారు. క్యాంప్‌ను ఎస్టీపీపీ జీఎం రాజశేఖర్ రావుతో కలిసి మంచిర్యాల డీసీపీ భాస్కర్ పరీశిలించారు. చెన్నూర్‌లోని ప్రభుత్వ ఆస్పత్రిలో జైపూర్ ఏసీపీ వెంకటే శ్వర్లు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరంలో 300 మంది యువకులు, పోలీసులు పాల్గొని పెబ్లడ్ డొనేట్ చేశారు.
సీఐ రవీందర్, రూరల్ సీఐ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఆసిఫాబాద్‌లో ఏర్పాటుచేసిన శిబిరంలో యువకులు పాల్గొని 51 యూనిట్ల రక్త దానం చేశారు. హాజరైన అడిషనల్ ఎస్పీ ఆర్.ప్రభాకరరావు మాట్లాడుతూ రక్తదానం ప్రాణదానం, రక్తదానంపై అపోహలు వీడాలని పిలుపునిచ్చారు. బోథ్పోలీస్స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన శిబిరంలో 84 మంది నుంచి 84 యూనిట్ల రక్తం సేకరించినట్లు సీఐ రమేశ్, ఎస్ఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు. రక్త దానం ప్రాణదానంతో సమానమన్నారు.