సంగారెడ్డిలో 72  సైలెన్సర్ల ధ్వంసం

సంగారెడ్డి టౌన్, వెలుగు: బైక్​ సైలెన్సర్లను మార్చి చేసి, సౌండ్​ పొల్యుషన్​కు కారణం అవుతున్న వాటిని పోలీసులు ధ్వంసం చేశారు.  ఎస్పీ రూపేష్ ఆధ్వర్యంలో  సుమారు 72 బైక్​ సైలెన్సర్లను రోడ్​ రోలర్​తో తొక్కించారు.   గత వారం రోజులుగా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తూ మార్చిన  సైలెన్సర్లను గుర్తించామని తెలిపారు. టూ వీలర్స్ ఓనర్లు కంపెనీతో వచ్చిన సైలెన్సర్లను మాత్రమే వినియోగించాలని , సైలెన్సర్ మార్పు చేస్తే చర్యలు తప్పవన్నారు.

అలా మార్చిన 72 సైలెన్సర్లను తీసి, ధ్వంసం చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్​ ఎస్పీ సంజీవరావు సంగారెడ్డి, డీఎస్పీ సత్తయ్య గౌడ్ , ట్రాఫిక్ ఇన్​స్పెక్టర్​ సుమన్, టౌన్ ఇన్​స్పెక్టర్​ భాస్కర్ ,సంగారెడ్డి రూరల్ ఇన్​స్పెక్టర్​ అశోక్ పాల్గొన్నారు. ‌‌‌‌