మట్టి తరలిస్తున్న టిప్పర్లు పట్టివేత

బెజ్జంకి, వెలుగు : సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని చిలాపూర్ పల్లె గ్రామ శివారు రైతుల పొలాల నుంచిఎలాంటి అనుమతులు లేకుండా బెజ్జంకి మండల కేంద్రానికి అక్రమ మట్టి రవాణా చేస్తున్న మూడు టిప్పర్లు, జేసీబీని  ట్రాన్స్ పోర్ట్స్ అధికారులు పట్టుకొని పీఎస్ కు  తరలించారు. గాగిల్లాపూర్  శివారులో మోయ తుమ్మెద వాగు నుంచి అక్రమ ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్ ను పట్టుకుని పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు ఎస్సై జె కృష్ణారెడ్డి తెలిపారు. అనుమతులు లేకుండా అక్రమ ఇసుక రవాణా చేస్తే చట్టరీత్యా  కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై తెలిపారు