భారీగా గంజాయి పట్టివేత.. వాహనం సీజ్

సంగారెడ్డిలో పెద్ద మొత్తంలో గంజాయి స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఏఓబి నుంచి మహారాష్ట్రకు తరలిస్తున్న 83.4కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్న ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు చిత్తూరుకు చెందిన ఓ వ్యక్తిని అరెస్ట్ చేసి వాహనాన్ని సీజ్ చేశారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ 33.50 లక్షలని తెలుస్తోంది.

సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం కొంకోల్ చెక్ పోస్ట్ దగ్గర తనిఖీలు చేస్తుండగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో స్ముగ్లర్స్ కి గట్టి వార్నింగ్ ఇచ్చారు పోలీసులు. డ్రగ్స్ సరఫరాకి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.