కోల్‌బెల్ట్, వెలుగు: మందమర్రి పట్టణంలో గంజాయి అమ్ముతున్న గుర్రాల అనిత అనే మహిళను బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె వద్ద నుంచి 1.1కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్, మందమర్రి సీఐ శశిధర్‌రెడ్డి వివరాలు వెల్లడించారు. విద్యానగర్‌కు చెందిన అనిత తక్కువ కాలంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో అదే కాలనీకి చెందిన మక్కల గంగాధర్అనే యువకుడికి డబ్బులిచ్చి మహారాష్ట్రలోని చంద్రపూర్‌కు వెళ్లి గంజాయి తీసుకురావాలని కోరగా 2 కిలోల గంజాయి తీసుకొచ్చి ఇచ్చాడు.
మహిళ పలువురికి ఒక్కో ప్యాకెట్ రూ.300 చొప్పున విక్రయిస్తోంది. పక్కా సమాచారం అందుకున్న మందమర్రి ఎస్ఐ రాజశేఖర్, పోలీసులు ఆమె ఇంటిపై దాడి చేసి 1.1కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారని, నిందితురాలిని రిమాండ్‌కు పంపినట్లు ఏసీపీ తెలిపారు.