ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చేస్తుంటే ముగ్గురు అరెస్ట్.. ఎందుకో తెలుసా?

నిర్మల్ : నిర్మల్ జిల్లాలో ఇన్ స్టాగ్రామ్ రీల్స్ చేస్తున్న ముగ్గురు ఆకతాయిలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఊరికే రీల్స్ చేస్తే ఎవరినీ పోలీసులు అరెస్ట్ చేయరు కదా.. అయితే ఈ ముగ్గురు యువకులు మారణాయుదాలతో రీల్స్ చేస్తున్నారు. అందుకే నిర్మల్ పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. రివాల్వార్ లోడ్ చేసి కాల్పులు జరుపుతున్నట్లు, గన్ తలకు గురిపెట్టుకుంటూ వీడియోలు తీశారు. వాటిని ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. 

తల్వార్, కత్తులతో ఫొటోలకు ఫోజులిచ్చుకుంటూ వారి అకౌంట్లో పోస్టులు పెట్టారు. ఆ వీడియోలు, ఫోటోలు నిర్మల్ జిల్లా పోలీసు అధికారుల కంట పడ్డాయి. ఫేమస్ అవ్వడానికి మారణాయుధాలతో రీల్స్ చేయడంపై పోలీసులు  సీరియస్ అయ్యారు. వెంటనే వారిని అరెస్ట్ చేసి యాక్షన్ చేసుకున్నారు. జాగ్రత్త మరి ఫేమ్  కోసం పోయి పోలీస్ స్టేషన్ పాలవుతారు.

Also Read:ఎలన్ మస్క్‌కు షాకింగ్ న్యూస్ : 20 శాటిలైట్లు డేంజర్ జోన్‌లో