- జాగిలాలతో తనిఖీలు
నిర్మల్, వెలుగు : నిర్మల్ జిల్లా వ్యాప్తంగా 24 గంటలపాటు విస్తృత తనిఖీలు చేపట్టి 664 కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ జానకి షర్మిల ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు భైంసా ఏఎస్పీ అవినాశ్ కుమార్, నిర్మల్ డీఎస్పీ గంగారెడ్డితోపాటు సీఐలు, ఎస్ఐలు శనివారం నుంచి ఆదివారం వరకు తనిఖీలు కొనసాగించినట్లు చెప్పారు. ఆమె వివరాల ప్రకారం.. జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు ముమ్మర చర్యలు చేపట్టారు.
ముఖ్యంగా గంజాయితో పాటు మత్తు పదార్థాల సప్లయ్, వినియోగంపై రెండు ప్రత్యేక జాగిలాలతో తనిఖీలు చేపట్టారు. రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్న డ్రంకెన్ డ్రైవ్, బహిరంగ స్థలాల్లో మద్యపానం వంటి వాటిపై చర్యలు తీసుకున్నారు. పట్టుబడిన వారికి అక్కడికక్కడే కౌన్సిలింగ్ నిర్వహిం చారు. వాహన తనిఖీలు చేపట్టారు. మొత్తం నాఖాబందీలో హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడిపిన 565 మందిపై, నంబర్ ప్లేట్ లేకుండా డ్రై వింగ్ చేస్తున్న 66 మందిపై
ఓవర్ స్పీడ్, డ్రంక్ అండ్ డ్రైవ్, మైనర్ డ్రైవింగ్, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తున్న వారిపై కూడా కేసులు నమోదు చేశారు. గంజాయి సప్లయ్ చేసే వారి వివరాలు తమకు అందించాలని, వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. శాంతిభద్రతలకు భంగం కలిగించే ఎంతటి వారినైనా సహించబోమన్నారు.