దండారి ఉత్సవాలకు రూ.1.5 కోట్లు

ఆసిఫాబాద్, వెలుగు : ఐటీడీఏ ఉట్నూర్ పరిధిలోని ప్రతి దండారికి రూ. 15 వేల చొప్పున కేటాయించామని పీవో  ఖుష్బూ గుప్తా ఓ ప్రకటనలో తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్​చార్జ్ మంత్రి సీతక్క సహకారంతో సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ఉట్నూర్ పరిధిలోని

వేయి గ్రామాల్లో దండారీకి రూ.15 వేల చొప్పున రూ.1.50 కోట్లను దీపావళి కానుకగా కేటాయించిందని వెల్లడించారు. ఆదివాసీ, గిరిజన సంస్కృతి సంప్రదాయాలను గౌరవిస్తూ, కాపాడుకుంటూ భావితరాలకు అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని తెలిపారు.