ఏడు లక్షలకు చేరిన ఓఎన్​డీసీ సెల్లర్ల సంఖ్య

న్యూఢిల్లీ: ఈ–కామర్స్​ వాడకాన్ని పెంచడానికి ప్రభుత్వం తీసుకొచ్చిన ఓపెన్​ నెట్​వర్క్​ఫర్​డిజిటల్​ కామర్స్​(ఓఎన్​డీసీ)లో చేరిన సెల్లర్లు, సర్వీసు ప్రొవైడర్ల సంఖ్య ఏడు లక్షలకు చేరింది. చిన్న వ్యాపారులూ తమ ప్రొడక్టులను, సేవలను ఈ–కామర్స్​లో సులువుగా అమ్ముకోవడానికి దీనిని 2021లో ప్రారంభించారు. 

చిన్న వ్యాపారాలకు  ఓఎన్​డీసీ ఎంతో మేలు చేసిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.  ఈ–కామర్స్​రంగాన్ని విప్లవాత్మకంగా మార్చిందని, వృద్ధిని, సంపదను పెంచుతోందని మెచ్చుకున్నారు.