ఎలక్ట్రిక్​ వాహనాల కొనుగోలు దారులకు గుడ్​న్యూస్​

  • పీఎం ఈ–డ్రైవ్  రెండో దశ షురూ

న్యూఢిల్లీ: కార్గో ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ల కొనుగోలుదారులకు సబ్సిడీలు ఇవ్వడానికి ప్రారంభించిన రూ. 10,900 కోట్ల ప్రధానమంత్రి ఈ–డ్రైవ్​ రెండో దశను కేంద్రం నోటిఫై చేసింది. ఎల్​5 కేటగిరీ ఎలక్ట్రిక్ త్రీ-వీలర్‌‌‌‌లపై కొనసాగుతున్న సబ్సిడీలు ఇదివరకే ముగిశాయి. ఈ నెల నవంబర్ ఏడో తేదీ వరకు 80వేల వాహనాలు రిజిస్ట్రేషన్‌‌‌‌ అయ్యాయి. ఈ ఏడాది ఏప్రిల్ 1  నవంబర్ 7, 2024 మధ్య నమోదైన 80,546 వాహనాలకు సబ్సిడీ మొత్తాన్ని వాహనానికి రూ. 50వేల నుంచి సగానికి తగ్గించారు.

 వాహన్ పోర్టల్‌‌‌‌లో నవంబర్ 8, 2024 నుంచి మార్చి 31, 2026 వరకు రిజిస్టర్ అయిన 1,24,846 వాహనాలు కిలోవాట్​అవర్​కు రూ. 2,500 చొప్పున సబ్సిడీలను పొందగలుగుతారు. మొదటి దశలో రూ.ఐదు వేల చొప్పున ఇచ్చారు.