కొత్త కారు ప్లానింగ్ లో ఉన్నారా.. ఈ ఏడాది రిలీజ్ అయ్యే న్యూ మోడల్స్ ఇవే..!

కొత్త ఏడాది వచ్చేసింది.. రెజల్యూషన్స్ తీసుకున్నవారు వాటిని కొత్త ఉత్సాహంతో మొదలు పెట్టేశారు. ఇంకొంతమంది ఈ ఏడాది రీచ్ అవ్వాల్సిన టార్గెట్స్ కోసం ప్లాన్స్ సిద్ధం చేసుకుంటున్నారు. ఇంకొంత మంది కొత్త ఏడాదిలో కొత్త వస్తువులు కొనటానికి ఆసక్తి చూపుతుంటారు. చాలా మంది కొత్త బైకులు, కార్లు కొనటానికి ఆసక్తి చూపుతుంటారు. మీరు కూడా ఈ ఏడాది కొత్త కార్ కొనడానికి ప్లాన్ చేస్తున్నారా.. అయితే, ఇది మీకోసమే. ఈ ఏడాది రిలీజ్ కానున్న కొత్త మోడల్స్ పై ఓ లుక్కేయండి..

2025లో రిలీజ్ కానున్న కొత్త మోడల్స్:

మారుతి సుజుకి ఈ విటారా:

2025లో మారుతి సుజుకి ఎలక్ట్రిక్ సెగ్మెంట్ లోకి ఎంటర్ అవుతోంది... ఈ విటారా బ్రాండ్ తో ఈ సెగ్మెంట్ లోకి అడుగు పెడుతోంది మారుతి సుజుకి.49 కిలోవాట్లు, 69 కిలోవాట్లతో డ్యుయల్ బ్యాటరీ ఫీచర్ తో ఈ మోడల్ ని లాంచ్ చేయనుంది మారుతి సుజుకి. డ్యుయల్ బ్యాటరీ ఫీచర్ వల్ల ఈ మోడల్ 500 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుందని తెలుస్తోంది. అంతే కాకుండా ఈ మోడల్ లో డ్యుయల్ స్క్రీన్ సెటప్ తో టచ్ స్క్రీన్ డిస్ప్లే ఇన్ఫోటైన్మెంట్ ఉండనుంది. డిజిటల్ డ్రైవర్ డిస్ ప్లే, ఆటోమాటిక్ క్లైమేట్ కంట్రోల్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్, వైర్లెస్ ఫోన్ ఛార్జింగ్ వంటి అదనపు ఫీచర్లు ఉండనున్నాయి. 

హ్యుండై క్రెటా ఈవీ:

హ్యుండై క్రెటా ఈవీ మోడల్ ను లాంచ్ చేయనుంది..  క్రెటా ఈవీలో హెడ్ ల్యంప్, డీఆర్ఎల్ డిజైన్ యధాతధంగా ఉంటుంది, దీంతో పాటు వెనుకవైపు ఎలక్ట్రిక్ బ్యాడ్జ్ ను కలిగి ఉంటుంది . అయితే... క్రెటా ఈవీ మోడల్ కు సంబంధించి హ్యుండై నుండి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు కానీ.. జనవరి 17న జరగనున్న భారత్ మొబిలిటీ ఎక్స్పోలో ఈ మాడల్ ను ప్రదర్శించనున్నట్లు తెలుస్తోంది. అయితే, క్రెటా ఈవీ ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు 500 రేంజ్ వరకు మైలేజ్ ఉంటుందని తెలుస్తోంది.

టాటా సియెర్రా:

టాటా సియెర్రా కాన్సెప్ట్ ను గతంలో 2023లో జరిగిన ఒక ఎక్స్పో లో ప్రదర్శించింది టాటా. ఈ మోడల్ ను ఇప్పుడు ICE, EV వర్షన్లలో మార్కెట్లలో విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మోడల్ 60 నుండి 80 కిలో వాట్ల బ్యాటరీ ప్యాక్ తో ఉంటుందని తెలుస్తోంది. సియెర్రా ఈవీ 500కిలోమీటర్ల వరకు రేంజ్ కలిగి ఉంటుందని తెలుస్తోంది. సియెర్రా ICE  1.5- లీటర్, 4-సిలిండర్ టర్బో- పెట్రోల్, సఫారి డిరైవ్డ్ 2-లీటర్ డీజిల్ ఇంజన్లతో రానున్నట్లు తెలుస్తోంది.

MG సైబర్ స్టర్:

MG సైబర్ స్టర్ మోడల్ ను భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025లో లాంచ్ చేయనుంది ఎంజీ. ఈ మోడల్ సాఫ్ట్ టాప్ తో సీజర్ డోర్స్ కలిగి ఉంటుందని తెలుస్తోంది. సైబర్ స్టర్ 77 KWh బ్యాటరీ ప్యాక్ తో ఒకే ఛార్జ్ లో డ్రైవింగ్ పరిధి 570 కిలోమీటర్ల రేంజ్ లో వస్తుందని తెలుస్తోంది.

స్కోడా ఆక్టావియా RS:

భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పోలో స్కోడా ఆక్టావియా RSను ప్రదర్శించనుంది. ఆక్టావియా RS 2 లీటర్ పెట్రోల్ టర్బోచార్జ్ ఇంజన్ తో 260 bhp, 370 Nm పీక్ టార్క్ తో లాంచ్ చేయనుంది స్కోడా. స్టాండర్డ్ ఆక్టావియాతో పోలిస్తే, RS 15 మిమీ తక్కువగా.. ఎలక్ట్రానిక్ లిమిటెడ్ స్లిప్ డిఫరెన్షియల్ తో వస్తోంది.