పీర్ల మసీదును ప్రారంభించిన ఎమ్మెల్యే సునీతారెడ్డి

శివ్వంపేట, వెలుగు: శివ్వంపేట మండలం గోమారం గ్రామంలో కొత్తగా నిర్మించిన పీర్ల మసీదును ఆదివారం ఎమ్మెల్యే సునీతారెడ్డి ప్రారంభించారు. హైదరాబాద్​లోని షాపూర్ నగర్​కు చెందిన వ్యాపారవేత్త మదన్ గౌడ్ రూ.12 లక్షల నిధులతో మొహర్రం పండగ సందర్భంగా మసీదును నిర్మించి ఇచ్చాడు.

అతడిని ఎమ్మెల్యే అభినందించారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ చంద్ర గౌడ్, మాజీ ఎంపీపీ హరికృష్ణ, మాజీ జడ్పీ కో ఆప్షన్ మెంబర్​ మన్సూర్అలీ, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రమణ గౌడ్,  ముస్లిం నాయకులు పాల్గొన్నారు.