డిగ్రీ కాలేజ్​కు మరో రెండు పీజీ కోర్సులు : ఎమ్మెల్యే హరీశ్ రావు

సిద్దిపేట రూరల్, వెలుగు: సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ లో మరో రెండు పీజీ కోర్స్ లు, మిట్టపల్లి వద్ద ఉన్న మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ లో ఒక పీజీ కోర్సు ప్రారంభమైనట్లు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిద్దిపేట డిగ్రీ కాలేజ్ లో ఇప్పటికే 10 పీజీ కోర్సులతో తరగతులు నడుస్తున్నాయని, కొత్తగా ఎమ్మెస్సీ మైక్రో బయాలాజీ, ఎమ్మెస్సీ కంప్యూటర్స్ 60 సీట్ల చొప్పున ఈ ఏడాది నుంచి ప్రారంభం కానున్నాయని చెప్పారు.

 మిట్టపల్లి ప్రాంతంలోని మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్, పీజీ కాలేజ్ గా అప్​గ్రేడ్​కావడంతో పాటు ఎమ్మెస్సీ ఫిజిక్స్ కోర్స్ ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం కానుందని పేర్కొన్నారు. డిగ్రీ కాలేజ్ లో రూ.2 కోట్ల 50 లక్షలతో నిర్మించే 12 అదనపు తరగతుల గదుల నిర్మాణం వెంటనే చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రక్త దానం చేస్తూ ప్రాణదాతలుగా నిలుస్తున్న రాజ్ గోపాల్ పేట్ యువకులను అభినందించారు. ఒక్కొక్కరూ 20 నుంచి 30 సార్లు రక్త దానం చేశారంటే వేలమంది ప్రాణాలు కాపాడినట్లే అన్నారు.