నేరడిగొండ, వెలుగు : ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని పీచర తదితర గ్రామాల్లో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. ప్రతీ ఇంట్లో కనీసం ఒకరు మంచం పట్టారు. పీచరలో దాదాపు 40 నుంచి 50 మంది జ్వరంతోపాటు ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.
దీంతో గ్రామంలో మండల వైద్యాధికారి సద్దాం వైద్య శిబిరం నిర్వహించి , బాధితులకు వైద్య పరీక్షలు చేసి మందులు అందజేశారు. అయితే, సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలను అప్రమత్తం చేయాల్సిన వైద్యాధికారులు నామ్ కే వాస్తేగా గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారని ప్రజలు వాపోతున్నారు.