కోతుల సమస్యలు పరిష్కరించకుంటే...కుటుంబ సర్వేను అడ్డుకుంటాం

జైపూర్(భీమారం)వెలుగు :  కోతుల సమస్యలు పరిష్కరించకుంటే  సమగ్ర కుటుంబ సర్వేను అడ్డుకుంటామని భీమారం మండల కేంద్రంలోని పలు కాలనీల ప్రజలు ఎంపీడీఓ ఆఫీసులోని సిబ్బందితో వాగ్వాదానికి దిగారు.  ఎన్నోసార్లు  ఈ సమస్యలు పరిష్కరించాలని వినతులు ఇచ్చినా  అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన చెందారు.  రోజుకు భీమారం మండల కేంద్రంలో సుమారు రోజుకు 10 మంది పై కోతులు దాడి చేస్తున్నాయని అన్నారు.

 ఓ మహిళ తమ పై  కోతులు దాడి చేస్తే రూ.20 వేల హాస్పిటల్ ఖర్చు అయిందని    సూపరిండెంట్  కు చెప్పుకుంటూ ఆవేదన వ్యక్తం చేసింది. అధికారులు    ముందు కోతుల సమస్యలు పరిష్కరించాలని  డిమాండ్​ చేశారు. ఈ కార్యక్రమంలో  మహేందర్ రెడ్డి, కుమార్, ఖమ్రోద్దిన్, సురేశ్, రాజ్ కుమార్, అరుణ్ , కాలనీ  ప్రజలు పాల్గొన్నారు.