దేశంలో ఎక్కడి నుంచైనా పింఛన్​

న్యూఢిల్లీ: తమ సభ్యులు దేశంలో ఎక్కడి నుంచైనా పింఛను పొందేలా చూడటానికి ఈపీఎఫ్​ఓ సెంట్రలైజ్డ్​ పెన్షన్​ పేమెంట్స్​ సిస్టమ్​(సీపీపీఎస్​)ను అన్ని రీజనల్​ ఆఫీసుల్లోనూ అందుబాటులోకి తెచ్చింది. దీనివల్ల 68 లక్షల మందికి ప్రయోజనం కలుగుతుందని, ఇక నుంచి ఏ బ్యాంకు నుంచి అయినా పింఛను తీసుకోవచ్చని తెలిపింది.  

ఇక నుంచి పెన్షనర్​ఒకచోట నుంచి మరోచోటికి మారినా డబ్బు పొందడానికి ఇబ్బంది ఉండదు. గత నెల ఈపీఎఫ్​ఓ 122 రీజనల్​ఆఫీసుల ద్వారా 68 లక్షల మందికి రూ.1,570 కోట్ల పింఛను అందజేసింది.