పెంబి ప్రాంతానికి  చేరుకున్న పెద్దపులి

పెంబి, వెలుగు : పెంబి  మండల కేంద్రానికి కూత వేటు దూరంలోని పెంబి తండా సమీప పరిసరాలలో ఉన్న నీలగిరి ప్లాంటేషన్ కు పులి చేరుకున్నట్టు పెంబి ఫారెస్ట్ రెంజ్ అధికారి రమేశ్ రావు తెలిపారు. ఈ సందర్భంగా పులి తిరిగిన  ప్రదేశంలోకి రేంజ్ అధికారి, ఎస్‌ఐ సాయి కుమార్, చేరుకొని పులి అడుగులను కనుగొన్నారు. ఈ సందర్బంగా రేంజర్ మాట్లాడుతూ..  పులి పెంబి పరి సర ప్రాంతంలోనే ఉన్నట్లు తెలిపారు. పెంబి, పెంబి తండా పరిసర ప్రాంత ప్రజలు, అప్రమత్తంగా ఉండాలన్నారు. వ్యవసాయ రైతులు అటవీ ప్రాంతానికి దగ్గర ఉన్న తోటల్లోకి ఒంటరిగా వెళ్లొద్దని సూచించారు. పెంబి పరిసర ప్రాంతంలోకి పులి రావడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.