కాలభైరవ ఆలయ అభివృద్ధికి కృషి

  •     పూజలు చేసిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ

కోల్​బెల్ట్/కోటపల్లి/జైపూర్​/చెన్నూర్, వెలుగు : కోటపల్లి మండలం పారుపల్లిలోని కాలభైరవ ఆలయాన్ని గురువారం పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం సమీపంలోని వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయాన్ని సందర్శించారు. ఫారెస్ట్​ పర్మిషన్లు తీసుకున్న తర్వాత ఆలయాన్ని అన్ని విధాలా అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.  

అంతకు ముందు స్వాతంత్ర్య వేడుకలను పురస్కరించుకొని  చెన్నూరు ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్​లో మహత్యా జ్యోతిబా ఫులే రెసిడెన్షియల్​ స్కూల్​ స్టూడెంట్లకు ఎంపీ గొడుగులు అందజేశారు. స్థానిక జర్నలిస్టులు ఎంపీని కలిసి తమకు ఇంటి స్థలాలు కేటాయించాలని కోరగా సంబంధిత అధికారులతో మాట్లాడి స్థలాలు వచ్చేలా కృషి 
చేస్తానన్నారు. 

బాధిత కుటుంబాలకు పరామర్శ

బీమారం మండల కేంద్రంలోని లంబాడి తండాకు చెందిన జర్పుల గొబ్రియా నాయక్,  జైపూర్​ మండలం ఇందారం గ్రామానికి చెందిన పాగల తిరుపతి ఇటీవల చనిపోగా బాధిత కుటుంబాలను ఎంపీ వంశీకృష్ణ పరామర్శిం చారు. ఆయన వెంట చెన్నూరు, కోటపల్లి, జైపూర్, భీమారం, మందమర్రి మండల, పట్టణ కాంగ్రెస్​ లీడర్లు, కార్యకర్తలు తదితరులున్నారు.