వినాయక మండపాలను సందర్శించిన ఎంపీ వంశీకృష్ణ

మంచిర్యాల జిల్లా నెన్నల్ మండలంలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పర్యటించారు. గణేష్ నవరాత్రుల సందర్భంగా స్థానిక వినాయక మండపాలను సందర్శించిన ఎంపీ వంశీకృష్ణ ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండల కాంగ్రెస్ లీడర్లు వంశీకృష్ణను శాలువాలతో సత్కరించారు. 

అనంతరం గొల్లపల్లి మాజీ ఎంపీటీసీ హరీశ్ గౌడ్ ఇంటికి వెళ్లిన వంశీకృష్ణ...కాంగ్రెస్ నేతలతో సమావేశం అయ్యారు. స్థానిక సమస్యలపై లీడర్లతో చర్చించారు. మండల అభివృద్ధికి అండగా ఉంటానని నేతలకు హామీ ఇచ్చారు వంశీకృష్ణ.