పెద్దపల్లి జిల్లా: కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కరెంటు కష్టాలు వచ్చాయని దుష్ప్రచారం చేశారని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ అన్నారు. రామగిరి మండలం రత్నాపూర్ గ్రామంలో సింగరేణి నిధులతో 4.16 కోట్ల నిర్మించిన 33/11 కె.వి విద్యుత్ ఉప కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి ఆయన ప్రారంభించారు.
జనాభాకు అనుగుణంగా విద్యుత్ వినియోగం పెరిగిందని, దానికి తగ్గట్లుగా విద్యుత్ ఇన్ఫాట్రాక్చర్ డెవలప్ చేస్తున్నామని ఎంపీ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన వచ్చినప్పటి నుంచి విద్యుత్ ఉత్పత్తిపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ప్రతి ఇంటికి నాణ్యమైన విద్యుత్ అందించేందుకు సబ్ స్టేషన్ లను ఏర్పాటు చేస్తుందని గడ్డం వంశీ కృష్ణ తెలిపారు.
విద్యుత్ వినియోగం ఎంత పెరిగితే దానికి తగ్గట్టుగా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నామని మంత్రి దుద్దళ్ల శ్రీధర్ బాబు అన్నారు. భారీ వర్షాలు, వాతావరణంలో మార్పులు, సాంకేతికపరమైన ఇబ్బందులు కలిగినప్పుడు జరిగే తప్పులను ప్రతిపక్షాలు రాజకీయాలు చేస్తున్నాయని మంత్రి అన్నారు. వ్యవసాయ, గృహ, పారిశ్రామిక రంగాలకు సంబంధించి ఎక్కడ కూడా విద్యుత్ ఇబ్బందులు తలెత్తకుండా విద్యుత్ శాఖ మంత్రి అధికారులు నిరంతరం పనిచేస్తున్నారని ఆయన వివరించారు. ఈ ప్రాంతంలో ఇంకా కొన్ని ట్రాన్స్ఫర్లు, సబ్ స్టేషన్లు అవసరం ఉన్నాయని.. ఆ అవసరాలకు అనుగుణంగా వాటిని ఏర్పాటు చేస్తామని మంత్రి హామి ఇచ్చారు.