వధూవరులను ఆశీర్వదించిన ఎంపీ వంశీ

కోల్​బెల్ట్/చెన్నూర్, వెలుగు : పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఆదివారం రాత్రి మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలం దుగ్నేపల్లికి చెందిన కాంగ్రెస్ నాయకుడు సింగిరెడ్డి మహేందర్ రెడ్డి–సంధ్యారాణి మ్యారేజ్​ రిసెప్షన్​కు హాజరయ్యారు. వధూవరులను ఆయన ఆశీర్వదిం చారు. చెన్నూర్ మండలం వెంకపేటకు చెందిన కాంగ్రెస్ కార్యకర్త జాడి రాజేందర్ నానమ్మ సమ్మక్క, 

దుగ్నేపల్లికి చెందిన పార్టీ కార్యకర్త వేయిగండ్ల సంపత్ పెద్దమ్మ దాగమ లచ్చక్క ఇటీవల చనిపోగా ఆదివారం ఆ కుటుంబాలను ఎంపీ వంశీకృష్ణ పరామర్శిచారు. ఆయన వెంట చెన్నూర్ మండలం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.