
పెద్దపల్లి, వెలుగు: లంచం తీసుకుంటూ పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ పీఆర్ ఏఈ జగదీశ్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. వివరాలిలా ఉన్నాయి.. ఓదెల మండలం బాయమ్మపల్లికి చెందిన కాంట్రాక్టర్ రాజుకు సీసీ రోడ్డు పనులకు సంబంధించిన రూ. 15 లక్షల బిల్లులు రావాల్సి ఉంది.
ఈ బిల్లుల కోసం ఏఈ రూ.90 వేలు డిమాండ్ చేయగా, బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. వారి సూచనల మేరకు శనివారం కాల్వశ్రీరాంపూర్ వెళ్లే రోడ్డుపై డబ్బులు ఇవ్వగా, ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. జగదీశ్‌ను అరెస్ట్ చేసి, కోర్టులో హాజరు పర్చనున్నట్లు ఏసీబీ డీఎస్పీ విజయకుమార్ తెలిపారు.