- పులుల సంరక్షణ పరిశీలిస్తం
- పీసీసీఎఫ్ డోబ్రియాల్
కాగజ్ నగర్: పులుల సంరక్షణ, మనుషుల ప్రాణ రక్షణకు మహారాష్ట్ర అనుసరిస్తున్న తీరును పరిశీలిచేందుకు తర్వలోనే ఆ రాష్ట్రంలో పర్యటిస్తామని పీసీసీఎఫ్ డోబ్రియాల్ చెప్పారు.
ఇటీవల కాగజ్ నగర్ డివిజన్ ఫారెస్ట్ లో రెండు పులి దాడులు జరిగి ఓ మహిళ మృతి చెందడం, ఇంకో రైతు గాయపడిన నేపథ్యంలో రోజూ పులి అలజడి రేకెత్తుతన్న పరిస్థితిని పరిశీలించేందుకు స్టేట్ వైల్డ్ లైఫ్ చీఫ్ వార్డెన్ ఈలు సింగ్ మేరు , జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ నీరజ్ కుమార్ తో కలిసి తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులోని సిర్పూర్ టీ మండలం జక్కాపూర్ మాకిడి మధ్య లో మహారాష్ట్ర ఫారెస్ట్ ఆఫీసర్ లతో అంతరాష్ట్ర కో ఆర్డినేషన్ మీటింగ్ నిర్వహించారు.
మహారాష్ట్ర లో పులుల సంరక్షణా చర్యలు ఏవిధంగా ఉన్నాయి, వాటి పర్యవేక్షణ ఎలా చేస్తున్నారు, టైగర్ ఆటాక్ జరిగిన సమయంలో ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారని అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో చంద్రపూర్ సబ్ డీ ఎఫ్ ఓ అవధుత్ వార్, దాబా ఆర్ ఎఫ్ ఓ గౌర్ కార్ ,కాగ జ్ నగర్ ఎఫ్ డీ ఓ సాహు, బాయాలజిస్ట్ ఏల్లం తదితరులు పాల్గొన్నారు.