పేపేలో వాటా అమ్మనున్న పేటీఎం

న్యూఢిల్లీ: ఫిన్‌‌‌‌టెక్ సంస్థ  పేటీఎం బ్రాండ్ వన్97 జపాన్  పేపేలో తన స్టాక్ అక్విజిషన్ హక్కులను విక్రయించనుంది. దీనివల్ల కంపెనీకి రూ. 2,364 కోట్లు సమకూరుతాయి.  

 పేపేకి సాంకేతిక సేవలను అందించడానికి పేటీఎం,  పేటీఎం సింగపూర్ జపాన్ డిజిటల్ వాలెట్ సంస్థ, సాఫ్ట్‌‌‌‌బ్యాంక్ కార్ప్, సాఫ్ట్‌‌‌‌బ్యాంక్ గ్రూప్ కార్ప్, యాహూ జపాన్  ఒప్పందం కుదుర్చుకున్నాయి.  సేవలకు బదులుగా పేటీఎం సింగపూర్  పేపేలో 7.2 శాతం వాటా పొందింది.