23 శాతం పెరిగిన పతంజలి ఆదాయం

న్యూఢిల్లీ : బాబా రామ్‌‌‌‌దేవ్‌‌‌‌ ప్రమోట్ చేస్తున్న పతంజలి ఆయుర్వేద్‌‌‌‌  మొత్తం ఆదాయం  2023–24 లో రూ.9,335.32 కోట్లకు చేరుకుంది.  అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో వచ్చిన రూ.7,533 కోట్లతో పోలిస్తే 23.15 శాతం వృద్ధి చెందింది.  పతంజలి ఫుడ్స్  ఆఫర్ ఫర్ సేల్  కింద సేకరించిన ఆదాయం, ఇతర గ్రూప్ కంపెనీలు  సాధించిన ఆదాయం కూడా ఇందులో కలిసి ఉన్నాయి.  

కార్యకలాపాలా ద్వారా  పతంజలి ఆయుర్వేద్‌‌‌‌కు రూ.6,460.03 కోట్ల ఆదాయం రాగా, ఇతర మార్గాల్లో రూ.2,875 కోట్లు వచ్చాయి. ఈ కంపెనీకి 2‌‌‌‌‌‌‌‌023–24 లో రూ.2,901.10 కోట్ల నికర లాభం వచ్చింది. 2022–23 లో రూ.578.44 కోట్ల నెట్ ప్రాఫిట్ పొందింది.