తప్పిపోయాడా.. వదిలి వెళ్లారా..!

మెదక్, వెలుగు: కాచిగూడ నుంచి మెదక్ వస్తున్న  రైల్లో బుధవారం ఏడాదిన్నర వయసున్న ఓ బాలుడిని ప్రయాణికులు గుర్తించారు. బోగీలో ఎవరినీ అడిగినా ఆ బాలుడు తమకు సంబంధించిన వాడు కాదన్నారు. దీంతో బాలుడిని చేగుంట మండలం వడ్యారం రైల్వే స్టేషన్ మాస్టర్ నవీన్ కు అప్పగించారు.

ఆయన కామారెడ్డి రైల్వే ఎస్ఐ తావు నాయక్కు సమాచారం అందించారు. ఆయన వచ్చి బాలుడిని మెదక్ లోని బాలల సంరక్షణ కేంద్రం అధికారులకు అప్పగించారు. కాగా ఆ బాలుడు తప్పి పోయాడా.. లేదా తల్లి దండ్రులు కావాలని  రైల్లో వదిలి వెళ్లారా అన్నది మిస్టరీగా మారింది.