కౌడిపల్లి, వెలుగు: అకాల వర్షాలకు మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలోని వెల్మకన్నతో పాటు పలు గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో వడ్లునాని మొలకలు వచ్చాయి. అధికారులు సరిపడా టార్ఫాలిన్లు సరఫరా చేయకపోవడంతో పలుచోట్ల భారీ వర్షానికి ధాన్యం తడిసిపోయింది. ఒకసారి తడిసిన వడ్లు ఆరబెట్టగా అవి ఎండే సరికి మళ్లీ వర్షం పడుతోంది.
మరోవైపు మొలకలు వచ్చిన ధాన్యాన్ని కొంటారో లేదో అని రైతులు ఆందోళన చెందుతున్నారు. కొనుగోలు కేంద్రాలకు లారీలు పంపించి కాంటా పెట్టిన వడ్లను వెంటనే రైస్ మిల్లులకు తరలిస్తే నష్టపోకుండా ఉంటామని రైతులు కోరుతున్నారు.