మెదక్ కలెక్టరేట్​లో ఈ-–ఆఫీస్​ ప్రారంభం

మెదక్​, వెలుగు: మెదక్ కలెక్టరేట్​లో 17 శాఖలతో ఈ-–ఆఫీస్ ను కలెక్టర్​ రాహుల్​ రాజ్​ బుధవారం ప్రారంభించారు. ఆయా శాఖలు ఫైళ్లను ఈ–ఆఫీసు ద్వారా డిజిటల్ సంతకంతో తనకు పంపించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ఫైళ్లను మాన్యువల్ గా తీసుకోబోమని, ఈ – - ఆఫీసులో సంబంధిత శాఖల అధికారుల డిజిటల్ సంతకంతోపాటు కలెక్టర్ సంతకం ఉంటుందని తెలిపారు.