ఇండియాలో వన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్లస్ పెట్టుబడులు రూ.6 వేల కోట్లు

  • వచ్చే మూడేళ్లలో ఇన్వెస్ట్ చేస్తామని ప్రకటన

న్యూఢిల్లీ: చైనీస్ స్మార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోన్ కంపెనీ వన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్లస్ ఇండియాలో రూ.6 వేల కోట్లు  ఇన్వెస్ట్ చేస్తామని ప్రకటించింది. వచ్చే మూడేళ్లలో ఈ పెట్టుబడులు పెట్టనుంది. ‘ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ కింద ఏడాదికి రూ.2 వేల కోట్లు  ఇన్వెస్ట్ చేస్తామని, ఇన్నోవేటివ్  ఫీచర్లతో కస్టమర్ల ముందుకు వస్తామని కంపెనీ పేర్కొంది. 

ఇండియాకు తగ్గ ఫీచర్లను డెవలప్ చేయడం,  డివైజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ఎక్కువ కాలం మన్నేలా చేయడం, కస్టమర్ సర్వీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మెరుగుపరచడానికి ఈ పెట్టుబడులు పెట్టనుంది. ఈ ఏడాది  సర్వీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెంటర్లను 22 శాతం పెంచామని, డైరెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఆపరేట్ చేస్తున్న సర్వీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెంటర్లు 11 శాతం పెరిగాయని వన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్లస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  ఇండియా సీఈఓ రాబిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లియో అన్నారు.