పారుపల్లి హైస్కూల్లో ఒకరికి బదులుగా మరొకరు ఎగ్జామ్ రాస్తూ దొరికిన్రు

  • సిద్దిపేటలోని పారుపల్లి హైస్కూల్ లో ఘటన
  • కేసు నమోదు చేసిన టూటౌన్ పోలీసులు

సిద్దిపేట రూరల్, వెలుగు: సిద్దిపేట పట్టణంలో ఓపెన్ టెన్త్ పరీక్షల్లో ఒకరికి బదులుగా మరొకరు ఎగ్జామ్ రాస్తూ పట్టుబడ్డాడు. సీఐ ఉపేందర్, గవర్నమెంట్ ఎగ్జామ్స్ అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మయ్య తెలిపిన వివరాల ప్రకారం..సిద్దిపేట అర్బన్ మండలం ఎన్సాన్ పల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ రవీందర్ గౌడ్ శుక్రవారం పారుపల్లి గవర్నమెంట్​హైస్కూల్​లోఓపెన్ టెన్త్​ఎగ్జామ్స్​రాయాల్సి ఉంది. కాగా అతడికి బదులుగా పంపరి బాలకిషన్ పరీక్షలకు హాజరయ్యాడు. 

అతను తీసుకొచ్చిన హాల్ టికెట్ తో పాటు, ఆధార్ తదితర గుర్తింపు పత్రాల్లో ఫేస్ కనబడకుండా బ్లాక్ చేశాడు. అనుమానం వచ్చిన ఎగ్జామ్ చీఫ్ సూపరింటెండెంట్​శ్రీనివాస్ అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. చీఫ్ సూపరిడెంట్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.