తక్కువ ధరలకే స్కూటర్లను విడుదల చేసిన ఓలా.. రేట్ ఎంతంటే..?

ఓలా ఎలక్ట్రిక్  'గిగ్', ‘గిగ్​ప్లస్​’ స్కూటర్లను విడుదల చేసింది. వీటి ధరలు వరుసగా రూ.40 వేలు, 50 వేలు. డెలివరీ ఏజెంట్ల వంటి గిగ్ కార్మికులను లక్ష్యంగా  వీటిని తీసుకొచ్చింది. మరో మోడల్​ఎస్​1జెడ్ ధర రూ.60 వేలు కాగా, ఎస్​1 జెడ్​ప్లస్​ధర రూ.65 వేలు. 'గిగ్'  'గిగ్ ప్లస్' స్కూటర్లను కంపెనీలకు అద్దెకు కూడా ఇస్తుంది. గిగ్‎ను ఒక్కసారి చార్జ్​చేస్తే 112 కిలోమీటర్లు వెళ్తుంది.  గరిష్టవేగం 25 కిలోమీటర్లు. గిగ్​ప్లస్​ 45 కిలోమీటర్ల వేగంతో 81 కిలోమీటర్లు వెళ్తుంది.