ఒకే రోజు 3,200 షోరూమ్ల ఓపెనింగ్.. 25 వేల డిస్కౌంట్.. ట్రెండ్ సెట్ చేసిన ఓలా

ఎలక్ట్రిక్ టూ వీలర్ మార్కెట్ లో ట్రెండ్ క్రియేట్ చేసిన ఓలా (Ola) కంపెనీ ఇప్పుడు మరో సంచలన నిర్ణయంతో మార్కెట్ ను షేక్ చేస్తోంది. టూ వీలర్ మార్కెట్ షేర్ ను గ్రాబ్ చేసేందుకు అద్భుతమైన ప్లాన్ చేసిన ఓలా.. అనుకున్నట్లుగానే క్రిస్మస్ సందర్భంగా దేశవ్యాప్తంగా 3,200 షోరూమ్ లను ఓపెన్ చేసి చరిత్ర సృష్టించిందనే చెప్పాలి. దేశంలో ఎక్కడికెళ్లినా ఓలా స్టోర్ ఉంటుందనేలా మొత్తం 4 వేల స్టోర్లకు కంపెనీని డిసెంబర్ 25న విస్తరిస్తామని ఓలా కంపెనీ సీఈవో భవీష్ అగర్వాల్ ఇప్పటికే ప్రకటించారు. 

ప్రకటించినట్లుగానే క్రిస్మస్ సందర్భంగా 3,200 స్టోర్లను బుధవారం (2024, డిసెంబర్ 25) ప్రారంభించింది. ప్రతి షోరూమ్ కు అటాచ్ చేస్తూ సర్వీస్ సెంటర్ ఉండేలా కొత్త స్టోర్లను ఓపెన్ చేసింది. ఇప్పటి వరకు 800 స్టోర్లు కలిగిన ఓలా.. కొత్తగా ఓపెన్ చేసిన స్టోర్లతో కలిపి ఇండియాలో షోరూమ్ ల సంఖ్య మొత్తం 4 వేలకు చేరుకుంది. ప్రకటించిన 19 రోజుల్లోనే 4 వేల స్టోర్లకు విస్తరించి ఈవీ మార్కెట్లో సంచలనం సృష్టించింది ఓలా కంపెనీ. కంపెనీ ప్రతి జిల్లా, టౌన్ లో ఉండేటట్లుగా ప్లాన్ చేశామని, బడ్జెట్ ఎలక్ట్రిక్ స్కూటర్ లో లీడింగ్ పొజిషన్ లో ఉంటామని ధీమా వ్యక్తం చేశారు భవీష్.

అద్దిరిపోయే డిస్కౌంట్లు:

క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న కొత్త స్టోర్ విజిట్ చేసిన వారికి ఓలా బంపర్ ఆఫర్ ఇస్తుంది. కొత్త స్టోర్ విజిట్ చేసిన వారికి.. ఓలా ఎస్1 ప్రో (Ola S1 Pro) కొన్నవారికి రూ.25 వేల డిస్కౌంట్ ఇంస్తున్నారు. కొత్త స్టోర్ ఓపెనింగ్ రోజు ఈ ఆఫర్ ఉంటుంది. అదే విధంగా S1 X models కొన్న వారికి రూ.7 వేల డిస్కౌంట్ అందిస్తున్నారు. ఇక క్రెడిట్ కార్డ్ ఈఎమ్ఐ ఆప్షన్స్ ద్వారా, అదేవిధంగా MoveOS ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి. 

ALSO READ | Rupee record low: రికార్డు స్థాయిలో పడిపోయిన రూపాయి విలువ.. కారణాలివే..

ఇక అత్యంత బెస్ట్ ఫీచర్ గా చెప్పుకుంటున్న MoveOS 5 బీటా వెర్షన్ రిజిస్ట్రేషన్ కూడా అందుబాటులోకి తెచ్చింది ఓలా. దీనిద్వారా గ్రూప్ నావిగేషన్, లైవ్ లొకేషన్ షేరింగ్, ఓలా మ్యాప్స్ లింక్ అయిన రోడ్ ట్రిప్ మోడ్ ఆప్షన్స్ వినియోగించుకోవచ్చు. ఇటీవల  S1 సీరీస్ లో భాగంగా గిగ్ ( Gig),  S1 Z మోడల్స్ ను రిలీజ్ చేసిన ఓలా.. త్వరలో రోడ్ స్టర్ సిరీస్ ను త్వరలోనే అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త ఫీచర్స్, కొత్త మోడల్స్ తో పర్సనల్, కమర్షియల్ వినియోగానికి అవకాశం కల్పిస్తున్నట్లు కంపెనీ సీఈవో భవీష్ అగర్వాల్ తెలిపారు.