ట్రిపుల్‌‌‌‌ ఐటీ స్టూడెంట్లతో ఆఫీసర్ల చర్చలు

బాసర, వెలుగు: తమ సమస్యలు పరిష్కరించాలని బాసర ట్రిపుల్‌‌‌‌ ఐటీ  స్టూడెంట్లు ఆరు రోజులుగా ఆందోళన చేస్తుండడంపై ఆఫీసర్లు స్పందించారు. స్టూడెంట్లు చర్చలకు రావాలని సూచించారు. దీంతో కమిటీగా ఏర్పడిన స్టూడెంట్లు సోమవారం ఇన్‌‌‌‌చార్జి వీసీ వెంకటరమణ సమక్షంలో చర్చలు జరిపారు. ప్రధానంగా ఇన్‌‌‌‌చార్జి వీసీకి బదులు రెగ్యులర్ వీసీని నియమించాలని, టీచింగ్, నాన్‌‌‌‌ టీచింగ్‌‌‌‌ పోస్టులను భర్తీ చేయాలని, కొత్తగా మెస్‌‌‌‌ టెండర్లు పిలవాలని, మౌలిక సదుపాయాలు కల్పించాలని స్టూడెంట్లు డిమాండ్ చేశారు. చర్చల అనంతరం స్టూడెంట్లు తరగతులకు హాజరువుతున్నారని అధికారులు తెలిపారు.