65 కొత్త మందులకు ధరలు నిర్ణయించిన ఎన్‌‌‌‌‌‌‌‌పీపీఏ

న్యూఢిల్లీ:  నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్‌‌‌‌‌‌‌‌పీపీఏ) 65 కొత్త మెడిసిన్స్‌‌‌‌‌‌‌‌  రిటైల్ ధరలను ఫిక్స్ చేసింది.  మరో 13 మందుల ధరల అప్పర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లిమిట్‌‌‌‌‌‌‌‌ను ప్రకటించింది. ఏడు మందులు  ధరల అప్పర్ లిమిట్‌‌‌‌‌‌‌‌ను  సవరించింది. తాజా చర్యలతో అత్యవసరమైన మందుల లిస్టులోని ధరలు 0.00551 శాతం మాత్రమే పెరుగుతాయి.

 టైప్‌‌‌‌‌‌‌‌ 2 డయాబెటిస్‌‌‌‌‌‌‌‌, హై కొలెస్ట్రాల్‌‌‌‌‌‌‌‌, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్‌‌‌‌‌‌‌‌లో వాడే మందులు,  పెయిన్‌‌‌‌‌‌‌‌ కిల్లర్ల  ధరలను ఫిక్స్ చేయగా, రాబిస్‌‌‌‌‌‌‌‌, ధనుర్వాతం, తట్టు వ్యాక్సిన్ల ధరల లిమిట్‌‌‌‌‌‌‌‌ను మార్చింది.