హైదరాబాద్​లో నథింగ్​సర్వీసింగ్ ​సెంటర్​

హైదరాబాద్​, వెలుగు : లండన్ కు చెందిన ఎలక్ట్రానిక్స్​ కంపెనీ నథింగ్ సర్వీస్ నెట్‌వర్క్ ను విస్తరిస్తోంది. ఇందులో భాగంగా హైదరాబాద్‌‌లో ప్రత్యేక సర్వీస్ సెంటర్​ను ఆరంభించింది. చెన్నైలోనూ ఒక దానిని ప్రారంభించినట్టు  నథింగ్ ఇండియా మార్కెటింగ్ హెడ్ ప్రణయ్ రావు అన్నారు.  

భారత మార్కెట్‌‌లో  వేగవంతమైన వృద్ధితో పాటు అత్యుత్తమ కస్టమర్ సేవలు,  మద్దతు అందించడానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ముంబై, ఢిల్లీ, బెంగళూరులో ఇది వరకే సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు.