బెజ్జంకి ప్యాక్స్ ను సందర్శించిన ఈశాన్య రాష్ట్రాల బృందం

బెజ్జంకి, వెలుగు: సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలోని  ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాన్ని బ్యాంకర్స్ ఇనిస్టిట్యూట్​ఆఫ్ డెవలప్​మెంట్​ప్రతినిధి బృందం డైరెక్టర్  వైద్యనాథ్ సింగ్, దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో 9 ఈశాన్య రాష్ట్రాల ప్రతినిధుల బృందం మంగళవారం సందర్శించారు. 23 మంది ట్రైనింగ్ అధికారులు ఫంక్షన్ హాల్, సహకార సంఘం, భవనాన్ని పరిశీలించారు. 

ఈ సందర్భంగా ప్యాక్స్ (ప్రైమరీ అగ్రికల్చర్​క్రెడిట్​సొసైటీస్)​ చైర్మన్ తన్నీరు శరత్ రావు సహకార సంఘం ద్వారా జరిగే లావాదేవీల గురించి వచ్చిన బృందానికి తెలియజేశారు. అనంతరం ప్రతినిధుల బృందం సభ్యులు  మాట్లాడుతూ బెజ్జంకిప్రాథమిక సహకార సంఘం సంఘం చాలా అభివృద్ధి బాటలో నడుస్తుందని ప్యాక్స్​ చైర్మన్ శరత్ రావు కృషి అభినందనీయమని కొనియాడారు. కేడీసీసీ వో సత్యనారాయణ రావు, ప్యాక్స్ డెవలప్​మెంట్​ఆఫీసర్ సత్యనారాయణ, వైస్ చైర్మన్ వేణు,  డైరెక్టర్లు రాజేశం, సురేశ్ బాబు, సీత భూమయ్య, మేనేజర్ ప్రవీణ్ కుమార్, దుర్గాప్రసాద్, సీవో శ్రీనివాస్, సిబ్బంది భాను, అనిల్ యాదవ్ పాల్గొన్నారు.