ఈఎల్‌‌ఐ కోసం యూఏఎన్ యాక్టివేషన్‌‌ తప్పనిసరి

  • నేడే చివరి తేది

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌‌లో ప్రకటించిన ఎంప్లాయ్‌‌మెంట్ లింక్డ్‌‌ ఇన్సెంటివ్ (ఈఎల్‌‌ఐ) స్కీమ్‌‌ కింద బెనిఫిట్స్ పొందాలంటే కొత్తగా ఉద్యోగాల్లో జాయిన్ అయిన వారు త్వరగా  తమ యూనివర్సల్‌‌ అకౌంట్ నెంబర్ (యూఏఎన్‌‌) ను యాక్టివేట్ చేసుకోవాలి. తమ ఆధార్ నెంబర్‌‌‌‌ను బ్యాంక్ అకౌంట్‌‌తో లింక్ చేసుకోవాలి. వీటిని  నవంబర్ 30 లోపు కచ్చితంగా పూర్తి చేయాలి.   

ఈఎల్‌‌ఐ స్కీమ్ కింద 2 కోట్ల ఉద్యోగాలను క్రియేట్ చేయాలని ప్రభుత్వం టార్గెట్​గా పెట్టుకుంది. మొదటిసారిగా జాబ్స్‌‌లో జాయిన్ అయిన వారికి రూ.15 వేల వరకు శాలరీ ఇవ్వడం, కంపెనీలు చేసే పీఎఫ్ కంట్రిబ్యూషన్‌‌లో కొంత రిఫండ్ చేయడం వంటి ప్రయోజనాలు ప్రకటించింది.