బాసర గోదావరికి నిత్య హారతి

బాసర, వెలుగు: ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన బాసర జ్ఞాన సరస్వతి ఆలయ సమీపంలో ఘాట్ నంబర్ వన్ వద్ద బుధవారం గోదావరి నదికి నిత్య హారతి ఇచ్చారు. ఆలయ వేద పండితులు వేదమంత్రాలతో మధ్య మహా హారతి ఇచ్చారు. భక్తులు, ఆలయ సిబ్బంది, కార్యనిర్వహణాధికారి విజయరామరాజు తదిత రులు పాల్గొన్నారు.