BUDGET 2024 -2025 : సబ్సిడీల్లో కోత!

  • ¯–ఆహారం, ఎరువులు, ఇంధనంపై రాయితీ 7.8 శాతానికి తగ్గింపు
  • సబ్సిడీల కోసం బడ్జెట్​లో రూ.3,81,175 కోట్లు కేటాయింపు

న్యూఢిల్లీ: ఆర్థిక స్థిరత్వాన్ని కారణంగా చూపిస్తూ కేంద్ర సర్కారు పలు కీలక రంగాల సబ్సీడీల్లో కోత విధించింది. ఆహారం, ఎరువులు, ఇంధన రంగాల్లో ఇస్తున్న సబ్సిడీలకు బడ్జెట్​లో కేటాయింపులు తగ్గించింది. 2024–25 ఆర్థిక సంవత్సరానికి మొత్తం సబ్సిడీల కోసం రూ. 3,81,175 కోట్లు మాత్రమే కేటాయించింది. గత ఆర్థిక సంవత్సరం రూ. 4,13,466 కోట్లు కేటాయించిన కేంద్ర సర్కారు.. ఈ సారి 7.8 శాతం సబ్సిడీల్లో కోతపెట్టింది.  

కేటాయింపులు ఇలా..

  • ఆహార సబ్సిడీ కోసం ఈ బడ్జెట్​లో రూ. 2,05,250 కోట్లు కేటాయించారు. గత ఆర్థిక సంవత్సరంలో కేటాయింపులు రూ. 2,12,332 కోట్లుగా ఉన్నాయి. ఈ రంగంలో రూ.7,082 కోట్లు సబ్సిడీ కోత విధించింది. నేషనల్​ ఫుడ్​ సెక్యూరిటీ యాక్ట్​ కింద ధాన్యం సేకరణ వ్యయం, అమ్మకాల ద్వారా వచ్చిన ఆదాయం మధ్య అంతరంతో పాటు 80 కోట్ల మందికి ఇస్తున్న ఉచిత రేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వంటివి ఈ సబ్సిడీ కిందకు వస్తాయి.
  • ఎరువుల రాయితీకోసం ఈ ఏడాది కేంద్రం రూ. 1,64,000 కోట్లు మాత్రమే కేటాయించింది. గత ఆర్థిక సంవతర్సం ఈ కేటాయింపులు రూ. 1,88,894 కోట్లు ఉండగా.. ఈ సారి 24, 894 కోట్లు కోతపెట్టింది.  యూరియా, యూరియేతర ఎరువులతో పాటు డీఏపీ, ఎంఓపీ వంటి వాటి కోసం ఈ సబ్సిడీని కేంద్రం ఉపయోగిస్తుంది. రైతులకు కావాల్సిన వస్తువులను అందుబాటు ధరలో ఉంచేలా తయారీ సంస్థలకు ఈ సబ్సిడీ
  • తోడ్పడుతుంది. 
  • ఎల్పీజీసహా పెట్రోలియం సబ్సిడీల కోసం కేంద్రం ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 11,925 కోట్లు కేటాయించింది. గత ఆర్థిక సంవత్సరంలో కేటాయించిన రూ. 12,240 కోట్లతో పోలిస్తే ఈ సారి 315 కోట్లు కోత పెట్టింది.