సాయిబాబాకు వెండి హారం బహూకరణ

నిర్మల్, వెలుగు : ఖానాపూర్ పట్టణం జంగల్ హనుమాన్ ఆలయ ప్రాంగణంలోని షిర్డీ సాయిబాబా ఆలయానికి నిర్మల్ ప్రధాన సెషన్స్ కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కల్వకుంట్ల వినోద్ రావు–మంజుల దంపతులు కిలో వెండి హారాన్ని శుక్రవారం బహూకరించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకుడు రామకృష్ణ ప్రత్యేక పూజలు చేసి సాయిబాబాకుఆ హారాన్ని అలంకరించారు.

కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ అంకం రాజేందర్, మాజీ జడ్పీటీసీ రాము నాయక్, నాయకులు అశోక్ రావు, శేఖరయ్య సెట్, కరిపే శ్రీనివాస్, వెంకట్ మహేంద్ర, మడిగెల గంగాధర్, రంజిత్ రావు తదితరులు పాల్గొన్నారు.