లంచం పట్టాడు.. ఏసీబీకి చిక్కాడు..

నిర్మల్ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారుల దాడులు కలకలం రేపింది. మున్సిపల్ కార్యాలయంలో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్, ఇన్చార్జి రెవెన్యూ ఆఫీసర్ షాకీర్ ఖాన్ బిల్ కలెక్టర్ నుంచి 15వేల రూపాయలు తీసుకుంటూ  ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. 

వివరాల్లోకి వెళితే భరత్ అనే వ్యక్తి కారుణ్య నియామకాల్లో భాగంగా బిల్ కలెక్టర్​ గా  ఉద్యోగం పొందాడు. అయితే ఇటీవల ఆయన ఉద్యోగం రెగ్యులర్​ అయింది. తన సర్వీస్ బుక్ లో సర్వీస్ ను నమోదు చేయాలని గత రెండు నెలల నుంచి   ఇన్చార్జి రెవెన్యూ ఆఫీసర్ షాకీర్​ ను  కోరుతున్నాడు. 20వేల రూపాయలు చెల్లిస్తేనే సర్వీస్ బుక్ లో నమోదు చేస్తానని చెప్పడంతో రూ.  15 వేలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. దీంతో భరత్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. బిల్ కలెక్టర్ భరత్ వద్ద నుండి 15వేల రూపాయల లంచం తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ  వి.వి రమణమూర్తి ఆధ్వర్యంలో ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని  అనంతరం కేసు నమోదు చేసి షాకీర్ ను రిమాండ్ కు తరలించారు