ఏసీబీకి చిక్కిన నిర్మల్‌‌‌‌‌‌‌‌ మార్కెటింగ్‌‌‌‌‌‌‌‌ ఏడీ

  • దడువాయి లైసెన్స్‌‌‌‌‌‌‌‌ రెన్యూవల్‌‌‌‌‌‌‌‌ కోసం రూ. 10 వేలు డిమాండ్‌‌‌‌‌‌‌‌
  • 7 వేలు తీసుకుంటుండగా పట్టుకున్న ఆఫీసర్లు

నిర్మల్, వెలుగు : లైసెన్స్‌‌‌‌‌‌‌‌ రెన్యూవల్‌‌‌‌‌‌‌‌ కోసం లంచం డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేసిన నిర్మల్‌‌‌‌‌‌‌‌ మార్కెటింగ్‌‌‌‌‌‌‌‌ ఏడీని ఏసీబీ ఆఫీసర్లు బుధవారం రెడ్‌‌‌‌‌‌‌‌హ్యాండెడ్‌‌‌‌‌‌‌‌గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం... కుమ్మరి వెంకటేశ్‌‌‌‌‌‌‌‌ అనే వ్యక్తి నిర్మల్‌‌‌‌‌‌‌‌లోని ఓ జిన్నింగ్‌‌‌‌‌‌‌‌ మిల్లులో దడువాయిగా పనిచేస్తున్నాడు. అతడి లైసెన్స్‌‌‌‌‌‌‌‌ గడువు ముగియడంతో రెన్యూవల్‌‌‌‌‌‌‌‌ కోసం మార్కెటింగ్‌‌‌‌‌‌‌‌ ఏడీ శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌ను కలిశాడు. 

దీంతో లైసెన్స్‌‌‌‌‌‌‌‌ రెన్యూవల్‌‌‌‌‌‌‌‌ కావాలంటే రూ. 10 వేలు ఇవ్వాలని ఏడీ డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేయడంతో రూ. 7 వేలు ఇచ్చేందుకు వెంకటేశ్‌‌‌‌‌‌‌‌ అంగీకరించాడు. తర్వాత ఏసీబీ ఆఫీసర్లను కలిసి ఫిర్యాదు చేశాడు. వారి సూచనలతో బుధవారం మార్కెట్ కమిటీ ఆవరణలోని ఏడీ ఆఫీస్‌‌‌‌‌‌‌‌లో శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌ను కలిసి రూ. 7 వేలు ఇచ్చాడు. అప్పటికే అక్కడ వేచి ఉన్న ఏసీబీ ఆఫీసర్లు ఏడీ శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌ను రెడ్‌‌‌‌‌‌‌‌ హ్యాండెడ్‌‌‌‌‌‌‌‌గా పట్టుకున్నారు. ఏడీ శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌ను కరీంనగర్‌‌‌‌‌‌‌‌ కోర్టులో హాజరుపరచనున్నట్లు ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి తెలిపారు. 

ఆదిలాబాద్‌‌‌‌‌‌‌‌లోని ఏడీ ఇంట్లో తనిఖీలు

ఆదిలాబాద్, వెలుగు : లంచం తీసుకుంటూ మార్కెటింగ్‌‌‌‌‌‌‌‌ ఏడీ ఏసీబీకి పట్టుబడడంతో ఆదిలాబాద్‌‌‌‌‌‌‌‌లోని ఆయన ఇంట్లో సైతం ఏసీబీ ఆఫీసర్లు తనిఖీలు చేశారు. సుమారు నాలుగు గంటల పాటు తనిఖీలు నిర్వహించి ఆస్తులకు సంబంధించిన పత్రాలను పరిశీలించారు. కుటుంబసభ్యులను విచారించిన అనంతరం పలు పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.