కడెం, వెలుగు: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో తెలంగాణకు పూర్తిగా అన్యాయం జరిగిందని యువజన కాంగ్రెస్ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు పొద్దుటూరి సతీశ్ రెడ్డి మండిపడ్డారు. బుధవారం కడెంలో కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బరుపటి రమేశ్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు తరి శంకర్‌తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
గత పదేండ్లుగా తెలంగాణ రాష్ట్రంపై బీజేపీ ప్రభుత్వం పక్షపాతం చూపుతోందని, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో తెలంగాణ అనే పదం కూడా తీయకపోవడం దారుణమ న్నారు. బడ్జెట్లో ఒక్క రూపాయి కేటాయించకపోతే రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతుందని ప్రశ్నించారు. తెలంగాణ బీజేపీ ఎంపీలు కూడా బడ్జెట్ గురించి సభలో మాట్లాడకపోవడం విడ్డూరమన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
కార్పొరేట్‌కు ఊడిగం చేసేలా కేంద్ర బడ్జెట్
కాగజ్ నగర్, వెలుగు: కేంద్రం బడ్జెట్ పూర్తిగా కార్పొరేట్‌కు ఊడిగం చేసేలా ఉందని ఎస్ఎఫ్ ఐ జిల్లా కార్యదర్శి చాపిలే సాయికృష్ణ అన్నారు. కూటమి ప్రభుత్వం మంగళవారం ప్రవేశపెట్టిన బడ్జెట్ విద్యారంగానికి మొండి చెయ్యి చూపించిందని, దేశంలో విద్యాభివృద్ధికి కనీసం నిధులు కేటాయించకపోవడం దారుణమన్నారు. దీనిపై కాగజ్ నగర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో నిరసన కార్యక్రమం చేపట్టారు. వెంటనే బడ్జెట్‌ను సవరించి విద్యా అభివృద్ధికి నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి సిరికొండ నితీశ్, నాయకులు రాజ్ మండల్, నాందేవ్, సాయి చరణ్, జ్ఞానేశ్వర్, కార్తీక్, చిత్తరంజన్ మండల్, ప్రదీప్ మండల్ తదితరులు పాల్గొన్నారు.