ఆర్టీసీ బెస్ట్ డిపో మేనేజర్ గా నిర్మల్ డీఎం

నిర్మల్, వెలుగు: నిర్మల్ డిపో మేనేజర్ ప్రతిమా రెడ్డికి రాష్ట్ర బెస్ట్ డిపో మేనేజర్ గా అవార్డు దక్కింది. హైదరాబాద్ ఆర్టీసీ కళా భవన్ లో జరిగిన ప్రగతి చక్ర అవార్డుల కార్యక్రమంలో ఈ  అవార్డును ఆమె సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్  చేతుల మీదుగా అందుకున్నారు.

ప్రతిమారెడ్డి ప్రతి సర్వీసును పర్యవేక్షిస్తూ, ఉద్యోగులతో సఖ్యతగా ఉంటూ వారిలో ఉత్సాహం నింపారు. ప్రతి రోజు గేట్ మీటింగులు, ఆదాయం కోసం కొత్త రూట్లలో సర్వీసులను తిప్పారు. సర్వీసు ఆక్యుపెన్సీ శాతాన్ని పెంచుతూ, డిపో ఆదాయాన్ని రూ.28 లక్షల నుంచి దాదాపు రూ.40 లక్షలకు పెంచారు. డిపోను లాబాల బాట పట్టించారు. దీంతో ఆమెకు ఈ అవార్డు దక్కింది.