జిల్లాస్థాయి కళోత్సవ్ పోటీలు షురూ

నిర్మల్, వెలుగు: కళలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని, విద్యార్థులు చదువుతో పాటు కళల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలని నిర్మల్​డీఈవో రవీందర్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని జేవీఎన్ఆర్ హైస్కూల్​లో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి కళోత్సవ్ కార్యక్రమాన్ని శనివారం డీఈవో ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. కళలకు దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉందని,  విద్యార్థులు తమకు ఆసక్తి ఉన్న కళలను ఎంచుకొని వాటిల్లోరాణించాలని కోరారు. 

జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచిన వారికి రాష్ట్రస్థాయి పోటీలకు అవకాశం లభిస్తుందన్నారు. పోటీలకు జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన విద్యార్థులు జానపద గీతాలు, నృత్యాలు, ఆర్ట్​, సంగీత వాయిద్యాలు, కథారచన తదితర అంశాల్లో ప్రతిభ చాటారు. విజేతలుగా నిలిచిన వారికి డీఈవో ప్రశంసాపత్రాలు అందజేశారు. క్వాలిటీ కోఆర్డినేటర్ నరసయ్య, సిద్ధ పద్మ, జిల్లా సైన్స్ ఆఫీసర్ డాక్టర్ వినోద్, స్కూల్ ప్రిన్సిపాల్ మణికుమారి, న్యాయ నిర్ణేతలు తదితరులు పాల్గొన్నారు.