గుమ్మడిదలలో ఘటన .. పసికందును కవర్లో చుట్టి పడేసిన్రు

పటాన్ చెరు(గుమ్మడిదల) వెలుగు: అప్పుడే పుట్టిన పసికందును కవర్లో చుట్టి పడేసిన ఘటన సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల పీఎస్​పరిధిలో గురువారం జరిగింది. వివరాల్లోకి వెళితే గుమ్మడిదల మండల పరిధిలోని దోమడుగు నల్ల పోచమ్మ ఆలయానికి వెళ్లే దారిలో అప్పడే పుట్టిన మగశిశువును ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కవర్లో చుట్టి పడేశారు. 

శిశువు పడిఉన్న విషయాన్ని  జీపీ కారోబార్​ గుర్తించి జీపీ కార్యదర్శికి సమాచారమందించాడు. కార్యదర్శి విష్ణువర్ధన్​ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటన స్థలానికి పోలీసులు వెళ్లి చూడగా అప్పటికే శిశువు మృతి చెంది ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.