ఎమ్మెల్యే వివేక్​ను కలిసిన కొత్త జీఎం జి.దేవేందర్

కోల్​బెల్ట్, వెలుగు: చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామిని మందమర్రి ఏరియా సింగరేణి కొత్త జీఎం జి.దేవేందర్​ మంగళవారం రాత్రి మర్యాదపూర్వకంగా కలిశారు. మంచిర్యాల హైటెక్​ సిటీ కాలనీలోని ఎమ్మెల్యే నివాసంలో జీఎం, ఎస్టేట్, సెక్యూరిటీ విభాగం అధికారులు ఎమ్మెల్యేను కలిసి బొకే అందజేశారు. 

మందమర్రి ఏరియాలోని బొగ్గు గనులు, కార్మికుల సంక్షేమం, ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ తదితర అంశాలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. ఎస్టేట్​ అధికారి వెంకటరెడ్డి, సీనియర్​ సెక్యూరిటీ ఆఫీసర్​ రవి కుమార్​ తదితరులు ఉన్నారు.