అభయ ఆంజనేయస్వామి నూతన కమిటీ నియామకం

  • చైర్మన్​గా కాంగ్రెస్​ లీడర్​బండి సదానందం యాదవ్​

కోల్​బెల్ట్, వెలుగు : మందమర్రి పట్టణం మారుతీనగర్​లోని అభయ ఆంజనేయస్వామి ఆలయ నూతన కమిటీని ఆదివారం ఎన్నుకున్నారు. ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో కమిటీ చైర్మన్​గా అఖిల భారత యాదవ మహాసభ జిల్లా ప్రెసిడెంట్, కాంగ్రెస్​ సీనియర్ ​లీడర్ ​బండి సదానందం యాదవ్​ను ఏకగ్రీవంగా ఎన్నుకు న్నారు. ఆ తర్వాత కమిటీ చైర్మన్ ​హోదాలో ఆయన మిగిలిన కమిటీని ప్రకటించారు. 

గౌరవ అధ్యక్షులుగా మూల రవీందర్ రెడ్డి, బండారి సత్యనారాయణ, నాగుల దుర్గయ్య, ఉపాధ్యక్షులుగా రాగిడి రాంరెడ్డి, కుంట తిరుపతి, ప్రధాన కార్యదర్శిగా మంచి కట్ల రమేశ్, జాయింట్ సెక్రటరీగా సిరిపురం లక్ష్మణ్, కోశాధికారిగా పెద్ది రాజన్న, లీగల్ అడ్వైజర్​గా మేకల రాజన్న, ఆర్గనైజింగ్ సెక్రటరీగా మేకల శంకర్, 
కార్యవర్గ సభ్యులుగా నగేశ్, రాజశేఖర్, సదానందం, రాజయ్య, వీరేశం, కనకయ్య, రమేశ్, శ్రీనివాస్​ను ఎంపిక చేశారు.