నెన్నెలలో కొండచిలువ కలకలం

బెల్లంపల్లి రూరల్​, వెలుగు : నెన్నెల మండల కేంద్రంలోని గోలం లక్ష్మీ పేరటిలో గోడ పక్కన సోమవారం కొండ చిలువ ప్రత్యక్షమైంది. 10 అడుగుల కొండచిలువను చూసి స్థానికులు భయాందోళన చెందారు. పెరటిగోడ పక్కన ఖాళీ సంచులు, చెత్తచెదారం ఉండటంతో పంచాయతీ కార్మికులు చెత్తను సేకరించి ట్రాక్టర్​లో తరలిద్దామని సంచులను తీశారు.  కింద కొండచిలువ కనిపించడంతో వెంటనే అటవీ అధికారులకు సమాచారం అందించారు. బెల్లంపల్లి నుంచి స్నేక్​ క్యాచర్​ దినేశ్​​ను పిలిపించి కొండచిలువను పట్టించారు. అనంతరం  జోగాపూర్​ అటవీ ప్రాంతంలో సురక్షితంగా వదిలిపెట్టారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.